నెల్లూరులో మత్స్యకారుల మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

గరుడధాత్రి : నెల్లూరు జిల్లా తీరప్రాంతంలో జరిగిన విషాదకర పడవ ప్రమాద ఘటనపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ, మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బోగోలు మండలం, జువ్వలదిన్నె గ్రామ పరిధిలోని అలిచెర్ల బంగారుపాళెం హ్యాంలెట్‌కు చెందిన మత్స్యకారులు వేట కోసం సముద్రంలోకి వెళ్లిన సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుందని అధికారులు మంత్రికి వివరించారు. భారీ ఈదురుగాలులు, ప్రతికూల...