GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 7:30 am Posted by : GARUDA DHATRI NEWS

నెల్లూరు సెంట్రల్ జైలులో ఎన్‌డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డికి వైసిపి నేతల పరామర్శ

నెల్లూరు సెంట్రల్ జైలులో ఎన్‌డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించిన వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి  సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య

నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న ఎన్‌డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు గురువారం కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైలు పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ పాలనలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాజకీయ ప్రతీకార ధోరణితోనే అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా సమస్యలను పక్కనపెట్టి రాజకీయ వేధింపుల పాలన కొనసాగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలకు ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.