GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 6:23 am Digital Edition : GURU SWAMY

నేటి నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్ లకు ధరఖాస్తుల స్వీకరణ

అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
– ఎంపీడీవో మహమ్మద్ రఫీ

పిచ్చాటూరు సెప్టెంబరు 6 గరుడధాత్రి:

అర్హత కలిగిన లబ్ధిదారులు కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. సోమవారం, సెప్టెంబర్ 7, 2026 నుంచి సంబంధిత గ్రామ సచివాలయాల్లో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎంపీడీవో సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, అర్హత ప్రమాణాలకు లోబడి ఉన్న వారు సంబంధిత గ్రామ సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
దరఖాస్తు చేసుకునే సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు, వ్యక్తిగత వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. పెన్షన్‌కు సంబంధించిన అర్హతలు, అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం, ఇతర వివరాల కోసం తమ పరిధిలోని గ్రామ సచివాలయంలో సంబంధిత సిబ్బందిని సంప్రదించాలని ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.