నేటి నుంచి సచివాలయాల్లో కొత్త పెన్షన్ లకు ధరఖాస్తుల స్వీకరణ

అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి - ఎంపీడీవో మహమ్మద్ రఫీ పిచ్చాటూరు సెప్టెంబరు 6 గరుడధాత్రి: అర్హత కలిగిన లబ్ధిదారులు కొత్తగా సామాజిక భద్రతా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పిచ్చాటూరు ఎంపీడీవో మహమ్మద్ రఫీ తెలిపారు. సోమవారం, సెప్టెంబర్ 7, 2026 నుంచి సంబంధిత గ్రామ సచివాలయాల్లో కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని...