GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:37 am Digital Edition : GURU SWAMY

నేడు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు 2026 నోటిఫికేషన్ విడుదల

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్15
బైరెడ్డిపల్లి మండలంలోని 82 పాఠశాలల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు
స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు 2026 కు నోటిఫికేషన్ బుధవారం విడుదల చేయనున్నారు. ఈ నెల
18 తేదీ ఓటర్ జాబితా ప్రదర్శన ,
25వ తేదీ తుది ఓటర్ల జాబితా ,
29వ తేదీ పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని మండల విద్యాశాఖ అధికారులు జనార్దన్ రెడ్డి, దేశమ్మ తెలిపారు. షెడ్యూల్ ప్రకారము పాఠశాల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకొని , నూతన పాఠశాల యాజమాన్య కమిటీ
ఎలక్షన్స్ కు ఏర్పాట్లు చేయవలసిందిగా అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది అని పేర్కొన్నారు.