నేడు మహానాడు సన్నాహక సమావేశం
మే 27,28,29 తేదీలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న మహానాడును విజయవంతం చేసేందుకు కొడవలూరు మండలం,రాచర్ల పాడు ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహానాడు సన్నాహక కమిటీ సమావేశం లో మహానాడు ప్రతినిధుల నమోదు కన్వీనర్, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారు తెలుగు తెలుగుదేశం పార్టీ పసుపు పండగ మహానాడు కు తరలిరానున్న ప్రతినిధులు ప్రతినిధులకు నమోదు ప్రక్రియ చేసెందుకు అవసరమైన ఏర్పాట్లపై కమిటీ సభ్యులకు మరియు ఐటీడీపీ చిత్తూరు,నెల్లూరు నాయకులు పత్తిపాటి యాచెంద్ర నాయుడు, షేక్ రసూల్ లతో భేటీ అయి పలు సూచనలు చేశారు.
సందర్భంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, చింతకాయల విజయ్ గారికి ఐటిడిసి నాయకులు పత్తిపాటి యాచంద్ర నాయుడు ,షేక్ రసూల్ పత్తిపాటి సత్కరించడం జరిగింది.
ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని చింతకాయల విజయ్ పిలుపు నిచ్చారు.