GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 5:16 am Digital Edition : GURU SWAMY

నేడు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు

కార్వేటి నగరం ఆగస్టు 20 గరుడదాద్రి న్యూస్

కార్వేటి నగరం లో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు నిర్వహించినట్టు ఆలయ అధికారి వీరాస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం పురస్కరించుకుని శుక్రవారం ఆలయంలో వరలక్ష్మి వ్రతం వేడుకలు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ పూజా కార్యక్రమానికి మహిళలు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన తెలిపారు.