నేడే మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

కార్వేటినగరం సెప్టెంబర్ 15 (గరుడ దాత్రి న్యూస్) కార్వేటినగరం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో బుధవారం ఉదయం 10:30 గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో రాధికా సింగిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ ప్రత్యేక అధికారులు తప్పక హాజరు కావాలన్నారు. వీరందరూ పూర్తిగా నివేదికతో హాజరుకావాలని ఆమె సూచించారు