నేత్రపర్వంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజలు

పౌర్ణమి సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు బైరెడ్డిపల్లి, అక్టోబర్ 25 గరుడధాత్రి : బైరెడ్డిపల్లిలోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో కొలువుదీరిన శ్రీ సత్యనారాయణ స్వామి ఉప ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారి వ్రత పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలు భక్తులకు నేత్రపర్వంగా నిలిచాయి. ఈ సందర్భంగా అర్చకులు రామకృష్ణమాచార్యులు శాస్త్రోక్తంగా కలశస్థాపన, స్వామివారికి అభిషేకం, సహస్రనామార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రత కథలను పఠించి వినిపించారు. పూజా కార్యక్రమాల అనంతరం...