నైజీరియాలో కత్తిసాములో కదం తొక్కిన లోకేష్!
యూ3 కామన్వెల్త్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్.. తెలంగాణ రాష్ట్రం తరఫున బరిలోకి దిగి ద్వితీయ స్థానంలో నిలిచిన వేమాని లోకేష్.. పుల్లమనాయుడు గ్రామంలో వెల్లువెత్తిన హర్షం రామచంద్రపురం: కత్తిసాము క్రీడలో రామచంద్రపురం మండలానికి చెందిన యువ ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. మండలంలోని పుల్లమనాయుడు గ్రామానికి చెందిన వేమాని చిరంజీవి, చంద్ర దంపతుల కుమారుడు వేమాని లోకేష్ నైజీరియా వేదికగా జరిగిన యూ3 కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించాడు. తెలంగాణ రాష్ట్రం తరఫున ఈ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న...