GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:34 am Digital Edition : GURU SWAMY

పంటల భీమా నమోదు గడువు పెంచాలి – వైకాపా

చౌడేపల్లి ఆగస్టు 01 గరుడ దాత్రి న్యూస్

పంటల భీమా నమోదు గడువును పెంచాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు అగ్గిదేవర వెంకటరమణ ప్రభుత్వాన్ని కోరారు శనివారం స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్–2026 సీజన్‌కు సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం నమోదు ప్రక్రియను జూలై 31 వరకు ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయితుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారని దీనివల్ల రైతులు పంట నష్టాలను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున భీమా సదుపాయాన్ని మరింతగా గడువు పెంచాలని ఆయన అన్నారు అంతేకాకుండా సంబంధిత సర్వర్లు పనిచేయకుండా పోవడంతో ఆలస్యం అవుతుందని రైతుల కోసం ప్రభుత్వం గడువు పెంచాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా బిసి సెల్ ప్రధాన కార్యదర్శి నరేష్ వైకాపా జిల్లా మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి శంషీర్ బాషా,మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ విజయ్,యల్లకుంట్ల వైకాపా గ్రామపంచాయతీ అధ్యక్షులు సొరకాయల సురేష్,గణేష్,ప్రసాద్,నారాయణ రెడ్డి,కొండయ్యగారిపల్లి వంశీ,కృష్ణప్ప,బోయకొండ గంగమ్మ దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యులు శెట్టిపేట శంకరప్ప తదితరులు పాల్గొన్నారు.