పండుగ వాతావరణాన్ని తలపించిన ఎమ్మెల్యే అమర్ జన్మదిన వేడుకలు

-ఊరు, వాడల్లో భారీగా వెలసిన బ్యానర్లు, కటౌట్లు -పల్లె పల్లెలో కేక్ లు పంచి సంభరాలు -సేవా కార్యక్రమాలతో అభిమానాన్ని చాటుకున్న నాయకులు, కార్యకర్తలు పలమనేరు, జులై 02 ( గరుడ ధాత్రి ) : పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పండుగ వాతావరణం ఉట్టిపడింది. ప్రతి ఊరిలోనూ బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు....