పదవికి ముగింపు.. .ప్రజాసేవకు కాదు – ఎంపిపి ప్రతిమ

సత్యవేడు, సెప్టెంబర్ 22 గరుడధాత్రి : ఐదేళ్ల రాజకీయ ప్రయాణానికి ముగింపు పలికే వేళ సత్యవేడు మండల పరిషత్‌ కార్యాలయంలో జరిగిన చివరి సర్వసభ్య సమావేశం భావోద్వేగంగా ముగిసింది. ఎంపీపీ ప్రతిమ సుశీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీటీసీలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సాధారణంగా అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలపై చర్చ జరగాల్సిన సమావేశం.. పదవీకాలం ముగింపు నేపథ్యంలో జ్ఞాపకాలను నెమరువేసుకునే వేదికగా మారింది. సమావేశంలో తన రాజకీయ ప్రస్థానాన్ని, మండల ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఎంపీపీ ప్రతిమ గుర్తుచేసుకున్నారు....