పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం శాశ్వతం!
పిచ్చాటూరు అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు-రేఖా హరిచంద్రరెడ్డి పిచ్చాటూరు సెప్టెంబర్ 23 గరుడధాత్రి : మండల పరిషత్ అధ్యక్షురాలిగా తన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కె.టి. రేఖా హరిచంద్రరెడ్డి ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాసేవలో సాధించిన ప్రతి విజయానికి సమిష్టి కృషే కారణమని ఆమె పేర్కొన్నారు. మండలంలోని గ్రామాల అభివృద్ధికి తనతో కలిసి పనిచేసిన ఎంపీటీసీ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, మండల పరిషత్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తనను ఆదరించి గెలిపించిన...