GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 May 2026, 7:24 pm Posted by : GARUDA DHATRI NEWS

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ఘన సత్కారం

పది ఫలితాల్లో ప్రతిభ చూపిన పిల్లలకు ఘన సత్కారం

-పదవ తరగతిలో 572 మార్కులు సాధించిన నాగలాపురం కానిస్టేబుల్ భూపతి కుమార్తె పూజకు అవార్డు

గరుడధాత్రి‌ న్యూస్ :

తిరుపతి జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల్లో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు. పదవ తరగతిలో 570 మార్కులకు పైగా, ఇంటర్మీడియట్‌లో 97 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన పోలీసుల పిల్లలకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రంతో పాటు రూ.10 వేల నగదు బహుమతిని కూడా అందించారు. *నాగలాపురం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ భూపతి కుమార్తె పూజ పదవ తరగతిలో 572 మార్కులు సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది.* ఆమెకు హోం మంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడం కుటుంబ సభ్యులు, పోలీసు సిబ్బందిలో ఆనందాన్ని నింపింది.
ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. విద్యతో పాటు క్రమశిక్షణతో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు.