పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించండి : మున్సిపల్ కమిషనర్

పలమనేరు, సెప్టెంబర్ 03 ( గరుడ ధాత్రి ) : పన్నులు సకాలంలో చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని పలమనేరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర వర్మ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, వార్డు పరిపాలనా కార్యదర్శులతో గురువారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను, తాగునీటి చార్జీల వసూళ్ల ప్రక్రియను మరింత ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో పన్ను బకాయిల వివరాలు: పాత బకాయిలు రూ. 2.74 కోట్లు, ప్రస్తుత డిమాండ్...