పన్నుల వసూళ్లలో గందరగోళం

చెల్లించినా.. మళ్లీ కట్టాల్సిందేనా..? నాగలాపురం అక్టోబర్ 7 గరుడధాత్రి : తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని నాగలాపురం మేజర్‌ పంచాయతీలో వార్షిక ఇంటి పన్ను, తాగునీటి పన్నుల వసూళ్ల వ్యవహారం తాజాగా వివాదాస్పదంగా మారింది. గతంలో పన్నులు చెల్లించినట్లు రశీదులు చూపుతున్నా.. పంచాయతీ రికార్డుల్లో వివరాలు లేవంటూ ప్రస్తుత సిబ్బంది మళ్లీ పన్నులు చెల్లించాలని కోరుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గతేడాది పన్నుల వసూళ్ల సమయంలో రెండు బిల్లు పుస్తకాలు ముద్రించి వసూళ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో...