కార్వేటి నగరం ఆగస్టు 5 (గరుడ దాద్రి న్యూస్)
:కార్వేటి నగరం. ఉదయం 10 గంటలకు కార్వేటినగరం గ్రామ పంచాయతీలో స్వచపదం కార్యక్రమంలో భాగంగా నగరి డి ఎల్ డి ఓ . ఎస్. విజయ్ రావు ఎంపిడిఓ రాధిక సింగిరెడ్డి ,డిప్యూటీ ఎంపిడిఓ మధుసూదన్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొని తడి చెత్త పొడిచెత్త మరియు బిన్ అండ్ బ్యాగ్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది గ్రామాలలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కార్వేటినగరం పంచాయతీ పై ప్రత్యేక దృష్టి పెట్టి చెత్త లేకుండా చూడాలన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు సెల్వి, విజయలక్ష్మి, ప్రవీణ్, హరిత రాయబారులు, తదితరులు పాల్గొన్నారు.