GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 8:01 am Digital Edition : GURU SWAMY

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన

బైరెడ్డిపల్లి గరుడదాత్రి సెప్టెంబర్18

బైరెడ్డిపల్లి మండలం లోని కడపనత్తం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలనందు ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి. మాంచాల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు ఓజోన్ పొర రక్షణ మరియు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
​ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస మరియు పోస్టర్ మేకింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఓజోన్ పొర క్షీణత, దాని వల్ల కలిగే నష్టాలు మరియు చెట్లను నాటడం ద్వారా పర్యావరణాన్ని ఎలా కాపాడుకోవచ్చో ప్రతి ప్రతిభ రూపంలో ప్రదర్శించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు హెచ్‌ఎం సి. మాంచాల మరియు గ్రీన్ టీచర్లు కలిసి బహుమతులు ప్రధానం చేశారు.
​ఈ కార్యక్రమంలో గ్రీన్ టీచర్లు రేఖ, నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.