పలమనేరు,ఆగస్టు 03 ( గరుడ ధాత్రి ) :
పలమనేరు పట్టణంలోని బాలాజీ కో-ఆపరేటివ్ సూపర్ బజార్‌లో తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందించే ప్రత్యేక విక్రయ కేంద్రాన్ని సోమవారం తహసీల్దార్ ఇన్భనాధన్ ప్రారంభించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ…సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే రూ.10 తక్కువ ధరకే నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ లోకేశ్ వర్మ మాట్లాడుతూ.. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పంపిణీ వర్తిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.52 చొప్పున, అలాగే రా-బీపీటీ బియ్యాన్ని కిలో రూ.50 లకే సబ్సిడీ ధరపై విక్రయిస్తున్నట్లు స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో బాలాజీ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి. బాలాజీ,టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం గౌడు, గిరిబాబు, సురేష్, ఖాజా, సుధాకర్,దీపికా కృష్ణమూర్తి,బ్రహ్మయ్య, నాగరాజ, డిష్ రమేష్, సుదర్శన్ బాలాజీ, విజయ్ శేఖర్, రెడ్డప్ప, మాబాషా తదితరులు పాల్గొన్నారు.