పలమనేరులో ’30 పోలీస్ యాక్ట్’ అమలు
అనుమతి లేని ర్యాలీలు, సభలపై కఠిన చర్యలు! పలమనేరు, ఆగస్టు 09 ( గరుడ ధాత్రి ) : పట్టణంలో ప్రజా శాంతి, భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణను దృష్ట్యా పలమనేరు పట్టణ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పలమనేరు డిఎస్పీ డేగల ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు పట్టణంలో ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, రాస్తారోకోలు, బహిరంగ సభలు, సమావేశాలు, ఊరేగింపులు వంటి కార్యక్రమాలను నిర్వహించరాదని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి తప్పనిసరి:...