పలమనేరు, జూన్ 18 ( గరుడ ధాత్రి ) : ఆంధ్రప్రదేశ్ సర్వే సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకటరమణ రెడ్డి వారి కార్యవర్గ సభ్యులతో కలిసి గురువారం పలమనేరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖలోని ఉద్యోగుల సమస్యలపై, ముఖ్యంగా గ్రామ సర్వేయర్ల పదోన్నతులు, జీతాల విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే గారితో సుదీర్ఘంగా చర్చించారు. సర్వే ఉద్యోగుల సమస్యలను సావధానంగా విన్న ఎమ్మెల్యే స్పందిస్తూ… ఈ సమస్యలను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు పూర్తి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడం పట్ల సర్వే సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్వే సంఘం పలమనేరు డివిజన్ అధ్యక్షులు నరేష్ తో పాటు నాయకులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.