బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్15
పలమనేరు లో మంగళవారం జరగనున్న విజయోత్సవ సభ విజయవంతం చేయాలని బైరెడ్డిపల్లి మాజీ జడ్.పి.టి.సి.రాధకిషోర్,మండల టి.డి.పి.అధ్యక్షుడు కిషోర్ గౌడు ,మండల ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం శెట్టి ఒక సంయుక్త ప్రకటనలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సబ్యులకు పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వ “2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం” పథకాల విజయాలను ప్రతిబింబించేలా, నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు అందరూ తరలి రావాలన్నారు.
ఈ మహాసభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానుల పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగకోరారు.టి.డి.పి.శ్రేణులు పలమనేరు సమీపంలోని క్యాటిల్ ఫామ్ బ్రిడ్జ్ దగ్గర కి 9-30 గంటలకు చేరుకోవాలి అక్కడ నుంచి ర్యాలీ గా తెలుగుదేశం పార్టీ కార్యాలయం చేరుకొవాలన్నారు.