GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 8:25 am Digital Edition : GURU SWAMY

పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకున్న సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర

సురుటుపల్లిలోని శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయాన్ని పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న జడ్జి కుటుంబానికి ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు ఘన స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

అనంతరం జడ్జి రాఘవేంద్ర కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రదోష పూజలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ అర్చకులు జడ్జి రాఘవేంద్రకు ఆశీర్వచనం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు మరియు భక్తులు పాల్గొన్నారు.