GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 8:07 am Digital Edition : GURU SWAMY

పాతపేటలో వసంతోత్సవంతో ఘనంగా ముగిసిన గంగజాతర వేడుకలు

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్4 :

బైరెడ్డిపల్లి మండలం లోని పాతపేట గ్రామంలో ఈ నెల ఒకటవ తేదీ నుండి గంగమ్మజాతర ప్రారంభం అయినది.గురువారం నాలుగవ రోజు గ్రామ దేవత శ్రీ భాటగంగమ్మ తల్లికి శాస్త్రోక్తంగా వసంతోత్సవ కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా భక్తులు గ్రామ పురవీధుల్లో ఒకరి పై మరొకరు రంగు రంగుల వసంతకాలను చెల్లుకొని సంబరపడ్డారు. వసంతోత్సవ కార్యక్రమం తో గంగజాతర ముగిసినట్లు అయినది.గ్రామంలో 4రోజులు ప్రతిష్టాత్మకంగా కొనసాగిన గంగజాతర విజయవంతం కావడానికి సహకరించిన దాతలు,గ్రామస్థులకు,
అధికారులు కు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలియజేశారు.