GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 8:21 pm Posted by : GARUDA DHATRI NEWS

పాతపేట శ్రీ గంగమ్మ అమ్మవారి జాతరలో కనువిందు చేసిన బాటగంగమ్మ తల్లి

-కమనీయoగా శ్రీ గంగమ్మ జాతర ప్రారంభఓ

బైరెడ్డిపల్లి గరుడదాత్రి జూన్1

బైరెడ్డిపల్లి మండలంలోని పాతపేట గ్రామoలో శ్రీ గంగమ్మ జాతర సోమవారం ప్రారంభంకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా
శ్రీ బాటగంగమ్మ తల్లి మూల విగ్రహం కు పంచామృత అభుషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని విశేష అలకరణలో తీర్చిదీద్ధి ప్రత్యేక పూజలు చేసి మహామంగల హారతి చేపట్టారు.అర్చకులు సురేష్ స్వామి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమానికి గ్రామస్థులు ,జయమ్మ మునుస్వామి శెట్టి( మాజీ ఎంపీటీసీ) ,ఉభయధారులగా వ్యవహరించారు. అమ్మవారికి చేపట్టిన అలకరణ భక్తులను కనువిందు చేసింది.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.