పాత బీగాలతో బైక్‌ల దొంగతనం – నిందితుడి అరెస్ట్, 7 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
గరుడధాత్రి న్యూస్ ఆగస్టు 3 ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు సహాయ పోలీస్ సూపరింటెండెంట్ ఏఎస్పీ శ్రీ యు. విభూ కృష్ణన్ ఐపీఎస్ గారి ఆజ్ఞల మేరకు, 1-టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ శ్రీ కొండారెడ్డి గారి పర్యవేక్షణలో ప్రొద్దుటూరు 1-టౌన్ పోలీసులు పాత బీగాలు ఉపయోగించి ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు 3,50,000 రూపాయల విలువైన 7 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు: ప్రొద్దుటూరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న...