పాన్ ఐఐటీ సమ్మిట్లో సీఎం చంద్రబాబు ఆవిష్కరణల పరిశీలన
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (ఆర్.శ్రీనివాసులు,గరుడ ధాత్రి న్యూస్): విజయవాడ అంబేద్కర్ కళావేదికలో శనివారం నిర్వహించిన 'పాన్ ఐఐటీ సమ్మిట్'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రాంగణంలో ఐఐటీయన్లు, వివిధ స్టార్టప్లు ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణల స్టాళ్లను ఆసక్తిగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన అత్యాధునిక డ్రోన్ను వీక్షించిన సీఎం, ఆ ప్రతినిధుల కోరిక మేరకు డ్రోన్పై తన సంతకం చేశారు. అలాగే సాధారణ పెట్రోల్ టూవీలర్లను కేవలం కొద్ది గంటల్లోనే ఈవీ (ఈ-వాహనాలు)గా...