పాన్ ఐఐటీ సమ్మిట్-2026 : రూ.500 కోట్లతో వెంచర్ ఫండ్ ఏర్పాటు
చిత్తూరు బ్యూరో, అక్టోబర్ 03 (గరుడ ధాత్రి న్యూస్):పాన్ ఐఐటీ సమ్మిట్-2026లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాన్ ఐఐటీ అల్యూమిని ప్రతినిధులు ఒక చరిత్రాత్మక సంయుక్త డిక్లరేషన్ ను విడుదల చేశారు. రాష్ట్రంలో డీప్ టెక్ రంగాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు నోడల్ సంస్థగా వ్యవహరించేలా రాజధాని అమరావతిలో శాశ్వత 'పాన్ ఐఐటీ అమరావతి కౌన్సిల్' ఏర్పాటుకు ఉభయ పక్షాలు నిర్ణయించాయి. అంతేకాకుండా, నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి మరియు స్టార్టప్లను ప్రోత్సహించే లక్ష్యంతో రూ.500 కోట్ల భారీ నిధులతో 'పాన్...