పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా శ్రీసిటీ -18 ఏళ్ల సుస్థిర ప్రగతి ప్రస్థానం
సత్యవేడు , ఆగస్టు 08, గరుడధాత్రి : దక్షిణ భారతదేశంలో ఒక పారిశ్రామిక విప్లవానికి నాందిగా మొదలైన 'శ్రీసిటీ', నేడు 18 వసంతాలను పూర్తి చేసుకుని, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ పారిశ్రామిక హబ్‌గా ఎదిగింది. రాష్టానికి తలమానికంగా, దేశ పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా సుస్థిర అభివృద్ధి సాధించింది. దేశ విదేశాల బ్యూరోకాట్లు, వ్యాపార ప్రతినిధులు, విద్యావేత్తలు అధ్యయనం చేసే ఉత్తమ మోడల్‌గా కీర్తి గడించింది. 8 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించి ఉన్న శ్రీసిటీలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 260కుపైగా...