GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:01 pm Digital Edition : GURU SWAMY

పార్టీ సభ్యుల గుర్తింపునకు ‘మై టీడీపీ’ మైలురాయి

* తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్

కుప్పం,ఆగస్టు 23 గరుడధాత్రి న్యూస్

విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో మాట్లాడిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ‘మై టీడీపీ’ యాప్ ప్రాధాన్యతను శ్రేణులకు వివరించారు. పార్టీ కోసం అహరహం శ్రమించే బూత్ స్థాయి అధ్యక్షులు, కార్యకర్తలను నేరుగా గుర్తించి, వారి పనితీరును అంచనా వేసేందుకే ఈ ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు తెలిపారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలతో పాటు క్షేత్రస్థాయిలో సభ్యులు నిర్వహించే ప్రతి సేవా చిత్రాన్ని లేదా సమాచారాన్ని యాప్లోని ‘ఫీడ్’విభాగంలో అప్లోడ్ చేస్తే అది నేరుగా వారి సభ్యత్వ సంఖ్యకు అనుసంధానమవుతుందని చెప్పారు. లోకల్ బాడీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, కార్యకర్తలందరూ ‘మై టీడీపీ’ ద్వారా సమన్వయమవుతూ, ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పక్కా ప్రణాళికతో పని చేయాలని పిలుపునిచ్చారు.