GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 02 August 2026, 8:10 am Digital Edition : GURU SWAMY

పింఛను సొమ్ములతో.. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం -ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

చిత్తూరుఆగస్టు1(గరుడదాత్రి న్యూస్)

ఎన్నికల హామీని అమలు చేస్తూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పింఛను సొమ్ములు అందిస్తున్న కూటమి ప్రభుత్వం పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. చిత్తూరు రూరల్ మండలం అనంతాపురం గ్రామంలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. స్థానిక కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి వృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు పింఛను సొమ్ములను అందించారు. ఈ సందర్భంగా వారితో ఆప్యాయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, మండల పార్టీ అధ్యక్షుడు రఘు, పరిశీలకులు కుమారి, కూటమి నాయకులు చంద్ర ప్రకాష్, జయచంద్ర నాయుడు, సికె లావణ్య, అనురాధ గిరీ, మోహన్ రాజ్, శ్యామ్, మంజూష్, లీలావతి, మండల, గ్రామ పంచాయతీ తెదేపా కమిటీల సభ్యులు పాల్గొన్నారు.