పిచ్చాటూరులో ఆధార్ సేవల కోసం అవస్థలు..
-స్వంత ఖర్చులతో కేంద్రం ఏర్పాటు చేస్తానంటున్న యువనేత జార్జ్ విజయ్ పిచ్చాటూరు జూన్ 24 గరుడధాత్రి : మండల పరిధిలో ప్రజలు ఆధార్ సేవలు పొందాలంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సచివాలయ కేంద్రాల ద్వారా ఆధార్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్యోగులపై అదనపు పనిభారం ఉండటంతో ప్రజలకు సక్రమంగా సేవలు అందించడం కష్టంగా మారింది. ముఖ్యంగా మండలంలోని సుదూర ప్రాంతాల ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....