GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 9:24 pm Digital Edition : GURU SWAMY

పిచ్చాటూరులో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు 

పిచ్చాటూరులో ఘనంగా నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలు

పిచ్చాటూరు గరుడ ధాత్రి:

 

తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 76 వ జన్మదినం సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పిచ్చాటూరు మండలంలో ఘనంగా జరిగాయి.నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి పేరిట పూజలు నిర్వహించిన కూరపాటి శంకర్ రెడ్డి ,జన్మదినం సందర్బంగా అభిమానుల బైక్ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు.టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు వెంపటి మాధవల నాయుడు గారితో కలిసి టి బీ ఆర్ కళ్యాణ మండపంలో అభిమానుల మధ్య కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని, అన్నదాన కార్యక్రమన్ని ప్రారంభించిన కూరపాటి శంకర్ రెడ్డి,ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు డాక్టర్ స్రవంతి, సురుటుపల్లి ఆలయ చైర్మన్ పద్మనాభ రాజు, సింగల్ విండో చైర్మన్ జయచంద్ర నాయుడు, నాయకులు రవి నాయుడు, చిన్న రాయల్, రవి, సుధా తదితరులు పాల్గొన్నారు.