పిచ్చాటూరులో ఘనంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
పిచ్చాటూరు, ఆగస్టు 4 గరుడధాత్రి: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా పిచ్చాటూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పిచ్చాటూరు, వెంగళత్తూరు గ్రామాల అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ఈ వారోత్సవాల్లో భాగంగా సీడీపీఓ సౌభాగ్యమ్మ ఆదేశాల మేరకు సూపర్వైజర్లు సుమతి, కల్పలత ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శిశువు జన్మించిన గంటలోపే తల్లి పాలను పట్టించాలని సూచించారు. పుట్టిన వెంటనే వచ్చే "ముర్రుపాలు" శిశువుకు అత్యంత పోషకమైనవని, ఇందులో...