పిచ్చాటూరులో జూన్ 1న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పిచ్చాటూరు, మే 31 గరుడధాత్రి : ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో జూన్ 1 (సోమవారం)న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వేదికలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, విద్య, విద్యుత్, సంక్షేమ తదితర అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను...