GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 01 June 2026, 7:01 pm Posted by : GARUDA DHATRI NEWS

పిచ్చాటూరులో పీజీఆర్ఎస్ నిర్వహణ

పిచ్చాటూరు, జూన్ 1 గరుడధాత్రి : పిచ్చాటూరు మండలం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ హాజరై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా వివిధ సమస్యలకు సంబంధించిన మొత్తం 8 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు. అందిన అర్జీలను నిర్దేశిత కాలపరిమితిలో పరిశీలించి పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, వీఆర్వోలు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.