పిచ్చాటూరులో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
పిచ్చాటూరు ఆగస్టు 10 గరుడధాత్రి : మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, ఎంపీడీవో మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు సమర్పించారు. ప్రజల నుంచి మొత్తం 4 అర్జీలను అధికారులు స్వీకరించారు. ప్రజలు అందజేసిన అర్జీలను పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.