GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 5:28 pm Posted by : GARUDA DHATRI NEWS

పిచ్చాటూరులో బూత్ లెవెల్ ఏజెంట్ల సమావేశం

పిచ్చాటూరు, జూన్ 14 గరుడధాత్రి: పిచ్చాటూరు మండల పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్ల (BLA) సమావేశం జూన్ 15 సోమవారం ఉదయం 11:30 గంటలకు స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సమావేశం తహశీల్దార్ వై. చంద్రబాబు నాయుడు మరియు ఎంపీడీవో మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జరగనుంది. మండలంలోని 165 నుంచి 196 వరకు ఉన్న అన్ని పోలింగ్ బూత్‌లకు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల బీఎల్‌ఏలు తప్పనిసరిగా హాజరు కావాలని అధికారులు కోరారు.
సమావేశంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి, అవసరమైన సూచనలు అందించనున్నట్లు తెలిపారు. సంబంధిత బూత్‌లకు చెందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని తహశీల్దార్ మరియు ఎంపీడీవో విజ్ఞప్తి చేశారు.