పిచ్చాటూరులో మే 11న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో మే 11వ తేదీ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపడతారని పేర్కొన్నారు. మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యల కోసం ప్రజలు ముందుగా ఎంపీడీవో కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుకు అధికారిక రశీదు...