GARUDA DHATRI
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 7:33 pm Posted by : GURU SWAMY

పిచ్చాటూరులో యువతకు డ్రగ్స్, గంజాయిపై అవగాహన కార్యక్రమం

పిచ్చాటూరు, జూలై 30 గరుడధాత్రి:

తిరుపతి జిల్లా ఈగల్ టీం సీఐ ప్రసాద్, తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఐసీసీ గ్రౌండ్‌లో యువతకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత తమ భవిష్యత్తు, కుటుంబ సంతోషం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. నేటి యువత దేశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు తోడ్పడాల్సిన బాధ్యత ఉందని, మత్తు పదార్థాల బారిన పడకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అలాగే డ్రగ్స్, గంజాయి వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మండల యువకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.