పిచ్చాటూరులో యువతకు డ్రగ్స్, గంజాయిపై అవగాహన కార్యక్రమం

పిచ్చాటూరు, జూలై 30 గరుడధాత్రి: తిరుపతి జిల్లా ఈగల్ టీం సీఐ ప్రసాద్, తహసీల్దార్ వై. చంద్రబాబు నాయుడు, పిచ్చాటూరు ఎస్సై రాఘవేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఐసీసీ గ్రౌండ్‌లో యువతకు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, యువత తమ భవిష్యత్తు, కుటుంబ సంతోషం, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. నేటి యువత దేశాభివృద్ధికి, సమాజ శ్రేయస్సుకు తోడ్పడాల్సిన...