పిచ్చాటూరులో ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమం
పిచ్చాటూరు, ఆగస్టు 3 గరుడధాత్రి: కూటమి ప్రభుత్వం చేపట్టిన 'రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమంలో భాగంగా పిచ్చాటూరు మండలంలో నిర్వహించిన ఇంటింటి ప్రచార కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ క్లస్టర్ ఇంచార్జ్, జెడ్పీటీసీ సభ్యుడు, జిల్లా ఫైనాన్స్ కమిటీ సభ్యుడు సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రజలకు అండగా నిలుస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలకే పరిమితం కాకుండా, వాటికి మించి...