పిచ్చాటూరులో విద్యా చైతన్యానికి శ్రీకారం

-ఘనంగా ప్రారంభమైన “బడి పిలుస్తోంది” ప్రచార రథం పిచ్చాటూరు, మే 28 గరుడధాత్రి : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా నిర్వహిస్తున్న “బడి పిలుస్తోంది” కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ ఎస్. మార్గదర్శకత్వంలో, జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) కె.వి.ఎన్. కుమార్ మరియు సమగ్ర శిక్ష ఏపీసీ భరత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లాలోని 36 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో పిచ్చాటూరు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో “ఇంటింటికీ బడి...