పిచ్చాటూరు, ఆగస్టు 17 గరుడధాత్రి:
పుత్తూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి మహేశ్వరరావు పిచ్చాటూరు మండలంలో పర్యటించి విద్యా సంస్థలను పరిశీలించారు.
వెంగళత్తూరు జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన 6, 7, 8 తరగతుల స్టడీ క్లాసులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం 9, 10 తరగతుల విద్యార్థులు రాస్తున్న ఎఫ్‌ఏ-1 గణితం పరీక్షను పర్యవేక్షించారు.
అలాగే మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఈ పర్యటనలో మండల విద్యాశాఖ అధికారిణి కె. హేమమాలిని పాల్గొన్నారు.