పిచ్చాటూరులో విద్యా సంస్థలను తనిఖీ చేసిన ఉప విద్యాశాఖ అధికారి
పిచ్చాటూరు, ఆగస్టు 17 గరుడధాత్రి: పుత్తూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి మహేశ్వరరావు పిచ్చాటూరు మండలంలో పర్యటించి విద్యా సంస్థలను పరిశీలించారు. వెంగళత్తూరు జడ్పీ హైస్కూల్‌ను సందర్శించిన ఆయన 6, 7, 8 తరగతుల స్టడీ క్లాసులను పరిశీలించి, విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం 9, 10 తరగతుల విద్యార్థులు రాస్తున్న ఎఫ్‌ఏ-1 గణితం పరీక్షను పర్యవేక్షించారు. అలాగే మండలంలోని పలు ప్రైవేట్ పాఠశాలలను తనిఖీ చేసి, విద్యా ప్రమాణాలు, నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థులకు...