పిచ్చాటూరులో వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలo
గరుడధాత్రి న్యూస్ : తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం టిచర్స్ కాలనీ వాస్తవ్యులు కుప్పాల మునస్వామి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సత్యవేడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోనేటి ఆదిమూలం గారు హాజరయ్యారు. పిచ్చాటూరు లోని యం.కె.టి మహల్‌లో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం గారు వధూవరులను ఆశీర్వదించి, వారి దాంపత్య జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, బంధువులు, అభిమానులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.