పిచ్చాటూరులో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

పిచ్చాటూరు, జూన్ 14 గరుడధాత్రి : మండల ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జూన్ 15 సోమవారం న పిచ్చాటూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు తహశీల్దార్ చంద్రబాబు నాయుడు తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులందరూ పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు. మండల స్థాయిలో పరిష్కరించగల సమస్యలకు ప్రజలు మొదటగా ఎంపీడీవో...