పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పిచ్చాటూరు ఆగస్టు 15 గరుడధాత్రి: జాతీయ స్ఫూర్తి, దేశభక్తి భావాలు వెల్లివిరిసేలా పిచ్చాటూరు జడ్పీ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. విద్యార్థులకు స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను వివరించి, దేశభక్తి, క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఉపాధ్యాయులు సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.