పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్ కు 9 అర్జీలు
పిచ్చాటూరు పీజీఆర్‌ఎస్ కు 9 అర్జీలు గరుడధాత్రి న్యూస్ మండల కేంద్రమైన పిచ్చాటూరులోని ఎంపీడీఓ కార్యాలయ సభా ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ చంద్రబాబు, ఎంపీడీఓల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 9 ఫిర్యాదులు అందాయి.వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు 6 దరఖాస్తులు రాగా.. సీడీపీవో, మండల సర్వేయర్, పోలీసు శాఖలకు ఒక్కో అర్జీ చొప్పున వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి ప్రధానంగా భూ రికార్డుల్లో పట్టాదారుల పేర్ల సవరణ, ప్రైవేటు భూముల...